Murali's Telugu Blog

All | General | Status | Java | Music | Politics
« ఉత్తమ తెలుగుబ్లాగర్ల ఎన్నిక - ... | Weblog | క్రికెట్ వరల్డ్ కప్ - 2007 »
20070305 Monday March 05, 2007

ఇంటర్మీడియట్లో తెలుగా? సంస్క్రతమా?

వారాంతంలో అమ్మతో ఫోన్లో మాటాడుతుంటే, ఇంటర్మీడియట్ చదువుతున్న మా బాబాయి కూతురు ప్రస్తావన వచ్చింది. తరువాత తనకి ఫోను చేసి, "మొదటి పరీక్ష ఏమిటని?" అడిగాను. "సంస్కృతం" అని జవాబు.

దాంతో, ఇప్పటికే ఎన్నోసార్లు, ఎందరో మేధావులు చితక్కొట్టి, ఉతికి ఆరేసిన ఆలోచన మెదిలింది. అదే, "ఇంటర్మీడియట్లో తెలుగు తీసుకోవాలా, సంస్కృతం తీసుకోవాలా" అని. నేను నూజివీడులో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సంస్క్రతం చెప్పే మేష్టారు లేకపోవటం చేత, ఏది తీసుకోవాలి అనే సందిగ్ధం లేకపోయింది. కానీ, హిందీ తీసుకుంటే ఇంకో నాలుగు మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, ఇంట్లో "హిందీ తీసుకుంటా" అని ప్రస్తావన పెట్టాను. "ఠాఠ్! హిందీ కోర్సు ఈ సంవత్సరమే పెట్టారు. ఆ చెప్పే మేష్టారు ఎలా చెప్తారో తెలియదు. తెలుగు తీసుకో!" అని నాన్న హుకుంతో ఆ సందిగ్ధం కూడా లేకపోయింది.

నూటికి 90% పైన మార్కులు రావాలంటే సంస్క్రతం తీసుకోవడం తప్పనిసరి మరి. నేను సంస్కృతం, హిందీ, తెలుగు - వీటిలో దేనికీ వ్యతిరేకిని కాను. ఈ మూడూ కాకుండా ఫ్రెంచి లాంటివి తీసుకున్నవాళ్లు కూడా నాకు తెలుసు. కానీ మార్కుల విషయంలో సమతుల్యత ఉండాలన్నది నా వాదన. అప్పుడు మార్కుల బట్టీ భాషను ఎన్నుకునే సందిగ్ధం ఉండదు.

అందుకని, first-language మటుకూ percentage కాకుండా percentile గా మార్చాలని నా ప్రతిపాదన. అప్పుడు తెలుగులో నూటికి 85 మార్కులు వచ్చిన వ్యక్తి 99 percentile కావొచ్చు. సంస్కృతంలో 98 మార్కులు వచ్చిన వ్యక్తి ఆ భాషలో 99 percentile కావొచ్చు. హిందీలో 90 మర్కులకే 99 percentile ఉండొచ్చు. ఈ percentileనే percentage గా లెక్క వేస్తే పెద్ద నష్టం ఉండదని నా అభిప్రాయం.

ఇలాంటి ప్రతిపాదన ఇంతకు ముందే ఎవరైనా చేసారేమో, నాకు తెలియదు.

Posted by Murali ( Mar 05 2007, 03:16:13 PM EST ) Permalink Comments [3]

Comments:

really nice idea.Intermediate board need to think about it.

Posted by srikanth on August 06, 2007 at 07:48 AM EDT #

Chala manchi abhiprayam.

Posted by Krishna (125.16.130.180) on February 26, 2008 at 09:16 AM EST #

percentile ఇవ్వాలన్న ప్రతిపాదన బావుంది .దీనికి విద్యార్థి సంఘాల నుండి ,ఉపాధ్యాయ సంఘాల నుండి. మద్దతు సంపాదించాలి .మనలాంటి వాళ్ళం అంతా కలిసి పనిచేధాం .internet ను మాధ్యమం గా వాడుకున్దాం

Posted by k.sudhakar. on March 18, 2008 at 06:53 AM EDT #

Comments are closed for this entry.

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers